హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం వివిధ శాఖల అధికారులు వేయిస్తంభాల ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. శివరాత్రికి వేలాదిగా తరలిరానున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా సీపీ అంబర్ కిషోర్ ఝా సూచన మేరకు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, సీఐ సతీశ్, పోలీస్ సిబ్బంది, ఆర్‌అండ్‌బీ, పురావస్తుశాఖ సిబ్బంది.. దేవాలయ ఈఓ అనిల్‌కుమార్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ శివరాత్రి రోజు జాగరణ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, మంత్రి కొండా సురేఖ ఆదేశానుసారం జాగరణ భక్తుల కోసం పండ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment