బాలికలకు కరాటే శిక్షణ
నల్లబెల్లి: బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం కరాటేలో శిక్షణ ఇస్తోంది. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో రాణిలక్ష్మీబాయి ఆత్మ రక్షణ ప్రశిక్షణ్ పేరుతో నిష్ణాతులైన మాస్టర్లు కరాటేలో మెళకువలు నేర్పిస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులు శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు.
మూడు నెలలు.. 36 తరగతులు
మూడు నెలల (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి) సమయంలో వారానికి మూడు రోజుల చొప్పున 36 శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు అవసరమైన ట్రైనర్లను కూడా నియమించింది. జిల్లాలోని 127 ఉన్నత పాఠశాలల్లో 9,669 మంది, 10 కస్తూర్బా గాంఽధీ బాలికల విద్యాలయాల్లో 2,673 మంది, ఐదు ప్రాథమి కోన్నత పాఠశాలల్లో 142 మంది విద్యార్థినులకు కరాటే మాస్టర్లు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో విద్యార్థినులు ప్రతిభ చాటుతున్నారు.
ఆరు నెలలకు పెంచాలి..
ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం ఇస్తున్న కరాటే శిక్షణ తరగతులు మూడు నెలలు సరిపోవడం లేదని విద్యార్థినులు, కరాటే మాస్టర్లు అభిప్రాయపడుతున్నారు. తక్కువ సమయంలో పూర్తిస్థాయి శిక్షణ పొందే అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆశయం నెరవేరేందుకు రాబోయే విద్యాసంవత్సరంలో కనీసం ఆరు నెలలపాటు కరాటే శిక్షణ ఇచ్చేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు
మెళకువలు నేర్పిస్తున్న మాస్టర్లు
సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థినులు
Comments
Please login to add a commentAdd a comment