
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
చెన్నారావుపేట: విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన సంఘటన గొల్లభామతండాలో శని వారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన గుగులోత్ మంగ్యా భార్య సునీత (38) రోజు వారీగా వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న తీగను ప్రమాదవశాత్తు తాకడంతో విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త మంగ్యా, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సునీత మృతితో గొల్లభామతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇల్లు కట్టుకుంటే బతికేది..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాలో మంగ్యా, సునీత దంపతులకు ఇల్లు మంజూరుకాగా పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. గ్రామ పెద్దలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇంటి స్థలంలోనే తాత్కాలికంగా తడకలతో రేకులషెడ్డు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటిలో పేలిపోయి ఉన్న విద్యుత్ తీగలు గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై సునీత మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇల్లు నిర్మించుకుంటే బతికేది అని తండావాసులు పేర్కొన్నారు.
గొల్లభామతండాలో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment