జిల్లాను అగ్రభాగాన నిలపాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పని చేసి జిల్లాను అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో అగ్రభాగాన నిలపాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని డైరీని ఆవిష్కరించారు. అనంతరం టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములై కలెక్టర్ మార్గదర్శకంలో సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం హనుమకొండ సిటీ ఉద్యోగుల క్యాలెండర్, పంచాయతీ కార్యదర్శుల క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ నాయకులు బైరి సోమయ్య, వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్యాంసుందర్, రామునాయక్, మోయిజ్, ల క్ష్మీప్రసాద్, ప్రణయ్, పృధ్వీ, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, నరేశ్, నాయకులు రాజమౌళి, సురేశ్, రాజేశ్‌ఖన్నా, రాజ్యలక్ష్మి, సింధురాణి, పావని, శ్రీలత ఉన్నారు.
విస్తృత అవగాహన కల్పించాలి
దివ్యాంగులకు ఇస్తున్న సదరం ధ్రువీకరణ పత్రానికి బదులు ప్రత్యేక యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ కార్డు (యూడీఐడీ) జారీ నేపథ్యంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో యూడీఐడీ మార్గదర్శకాలపై అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ అంబి శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి జయంతి పాల్గొన్నారు.
అర్హుల జాబితాను సిద్ధం చేయండి
జిల్లాలో ‘మిషన్ వాత్సల్య’ పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు లేని బాలబాలికలకు మొదటి ప్రాముఖ్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, బాల రక్షాభవన్ జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్‌చార్జ్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సీడబ్ల్యూజీ మెంబర్ సుధాకర్, ఎఫ్‌ఎంఎంఎస్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక, శిశుగృహ ఇన్‌చార్జ్ మేనేజర్ మాధవి, సోషల్ వర్కర్లు శ్రీనివాసులు, సునీత, చైతన్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment