శిల్పకళ అద్భుతం..
ఖిలా వరంగల్: కాకతీయుల నిర్మాణ శైలి, నల్ల రాతితో రూపొందించిన శిల్ప కళ వెరీ అద్భుతం అని స్టేట్ ఆర్కియాలజీ ఆఫ్ మైసూర్ ఎ.దేవరాజ్, హైదరాబాద్ సర్కిల్ కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ హెచ్.దేశాయ్ అన్నారు. ఖిలా వరంగల్ కోటను వారు మంగళవారం సాయంత్రం సందర్శించారు. కాకతీయుల ఖ్యాతిని కొనియాడారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్‌చార్జ్ శ్రీకాంత్, టీజీ టీడీసీ కోట ఇన్‌చార్జ్ గట్టికొప్పుల అజయ్, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ జాగిలాల
పాత్ర కీలకం: సీపీ
వరంగల్ క్రైం: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెలలో మొయినాబాద్‌లోని పోలీస్ జాగిలాల శిక్షణా కేంద్రంలో శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన ఐదు పోలీస్ జాగిలాలు వరంగల్ కమిషనరేట్ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో చేరి విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. పేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్ మాలినోస్, రెండు గోల్డెన్ రీట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీకి హ్యాండ్లర్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్, ఆర్‌ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, హ్యాండ్లర్లు రాజేశ్‌కుమార్, వెంకన్న, సురేశ్, దిలీప్ పాల్గొన్నారు.
కెరీర్ కౌన్సెలింగ్
సెల్ డైరెక్టర్‌గా చిర్ర రాజు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ సెల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెల్ నూతన డైరెక్టర్‌గా తెలుగు విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు నియమితులయ్యారు. ఈమేరకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదవిలో రాజు ఏడాదిపాటు కొనసాగుతారు. ఆయన కేయూ పాలకమండలి సభ్యుడిగా కూడా ఉన్నారు.
30 ఏళ్లు దాటిన వారికి
వైద్య పరీక్షలు నిర్వహించాలి
హసన్‌పర్తి: 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లుగా నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభించాలని సూచించారు. హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా డేను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి డీఎంహెచ్‌ఓ అప్పయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలను వందశాతం విజయవంతం చేయాలన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి తగిన సేవలందించాలని సూచించారు. అసంక్రమిత వ్యాధులపై అవగాహన నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి భార్గవ్, వైద్యులు కృతిక, సురేశ్, హెల్త్ సూపర్‌వైజర్ లచ్చు, మేరీ, రుతమ్మ, ఫార్మసిస్ట్ అజిత, స్టాఫ్‌నర్స్ విజయకుమారి, హెల్త్ అసిస్టెంట్ సంతోశ్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శిల్పకళ అద్భుతం..
Comments
Please login to add a commentAdd a comment