నాణ్యతా ప్రమాణాల పరిశీలన
కమలాపూర్: కమలాపూర్ పీహెచ్‌సీ పరిధి గూడూరు, ఉప్పల్ పీహెచ్‌సీ పరిధి గుండేడు, ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఏఏఎం)లను జాతీయ నాణ్యతా ప్రమాణాల కోసం ఎన్‌క్వాస్ రాష్ట్ర కన్సల్టెంట్ వినయ్ మంగళవారం పరిశీలించారు. ఇందులో భాగంగా.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవన నిర్మాణం, హెర్బల్ గార్డెన్, బయో మెడికల్ వేస్టేజీ, రోగులకు అందుతున్న సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసి వాటి బలోపేతానికి నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమాల్లో ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారి ఎండీ.రుక్మోద్దీన్, జిల్లా నాణ్యతా ప్రమాణాల ఇన్‌చార్జ్ మేనేజర్ సాగర్, వైద్యాధికారి డాక్టర్ పద్మజ, ఏఏఎం వైద్యులు సంయుక్త, మాధవి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment