వైభవంగా శివపార్వతుల రథోత్సవం
మడికొండ: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక రథంపై ప్రతిష్టించి వైభవంగా రథోత్సవం నిర్వహించారు. మడికొండలోని ప్రధాన వీధుల్లో ఉరేగించారు. రథానికి భక్తులు ఎదురేగి నీళ్లు ఆరబోసి మంగళ హారతులతో స్వాగతం పలికారు. రథోత్సవంలో భాగంగా కోలాటం, గొల్లడప్పులు, భజన బృందాలు, చిరుతల రామాయణం, నృత్యాల మధ్య రథోత్సవం సాగింది. వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కే.శేషుభారతి, అర్చకులు రాగిచేడు అభిలాష్‌శర్మ, పరశురాం విష్ణువర్ధనచార్యులు, సత్యనారాయణ శర్మ, మణిశర్మ, చైర్మన్ పైడిపాల రఘుచందర్, ధర్మకర్తలు బైరి రాజుగౌడ్, దండిగం శ్రీనివాస్, బోగి కేదారి, వస్కుల ఉమ, రోడ్డ దయాకర్, మాడిశెట్టి జ్ఞానేశ్వరి, కుర్ల మోహన్, తొట్ల రాజుయాదవ్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా శివపార్వతుల రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment