
మామునూరు ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్తత
ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల చేసిన నేపథ్యంలో శనివారం ఎయిర్‌పోర్ట్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు పీఎం మోదీ ఫ్లెక్సీకి, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఒకరి వేదికపైకి ఒకరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి తమ వల్లే అంటే.. ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషణలతో తోపులాడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోటాపోటీగా ప్రధాని నరేంద్ర మోదీ,
సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలకు
క్షీరాభిషేకం
బీజేపీ, కాంగ్రెస్
శ్రేణుల మధ్య తోపులాట
Comments
Please login to add a commentAdd a comment