
లక్ష్యం.. వంద శాతం
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
నల్లబెల్లి: గ్రామాల్లో ఆస్తి పన్ను వసూళ్లను పంచాయతీ అధికారులు వేగవంతం చేశారు. ఈ నెల 31 వరకు వందశాతం పన్నులు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా అధికారులు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 71 శాతం పూర్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి పన్నులే ప్రధాన ఆదాయ వనరు.
ఈ నేపథ్యంలో ఇంటి, నల్లా పన్నుల వసూళ్లపై పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇవి సకాలంలో వసూలైతే ప్రగతి సాధ్యమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నిధులు అరకొరగా విడుదల చేయడంతో ఇంటి, నల్లా పన్నుల వసూలు కీలకంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 30 రోజుల గడువు మాత్రమే ఉంది. ఎలాగైనా ఈ నెలాఖరు వరకు వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకుపోతున్నారు. ప్రజాపాలన, ఆర్థిక, సామాజిక సర్వే, ఇందిరమ్మ ఇళ్ల సర్వే, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల విధులు నిర్వర్తించిన పంచాయతీ సిబ్బంది పన్ను వసూళ్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించారు.
ఇంకా వసూలు చేయాల్సింది రూ.1,40,02,198
జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో 315 గ్రామ పంచాయతీలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు రూ.51,67,650 బకాయిలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,33,25,942 కాగా.. గత ఆర్థిక సంవత్సరం కలిపి మొత్తం రూ.4,84,93,592 పన్నుల వసూలు లక్ష్యంగా ఉంది. ఇప్పటి వరకు రూ.3,44,91,394 పన్నులు వసూలు చేశారు. ఇంకా రూ.1,40,02,198 వసూలు పూర్తి చేస్తామని పంచాయతీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్‌రీల్
గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై సిబ్బంది ప్రత్యేక దృష్టి
టార్గెట్ రూ.4,84,93,592..
వసూలైంది రూ.3,44,91,394
మరో 30 రోజుల్లో ముగియనున్న
ఆర్థిక సంవత్సరం
జిల్లాలో 11 గ్రామీణ మండలాలు..
315 గ్రామ పంచాయతీలు
మండలాల వారీగా గ్రామపంచాయతీలు, పన్నుల వసూళ్ల వివరాలు (రూ.ల్లో)..
మండలం గ్రామపంచాయతీలు లక్ష్యం వసూలైంది వసూలు
కావాల్సింది
చెన్నారావుపేట 30 34,07,013 23,34,018 10,72,995
దుగ్గొండి 34 45,86,374 31,76,118 14,10,256
గీసుకొండ 21 40,64,628 33,50,679 7,13,949
ఖానాపురం 20 43,50,036 32,21,544 11,28,492
నల్లబెల్లి 29 38,29,273 23,32,474 14,96,799
నర్సంపేట 19 45,20,719 35,98,614 9,22,105
నెక్కొండ 39 55,58,602 41,25,115 14,33,487
పర్వతగిరి 33 47,61,995 34,44,269 13,17,726
రాయపర్తి 39 54,12,419 27,46,405 26,66,014
సంగెం 33 43,72,240 34,93,779 8,78,461
వర్ధన్నపేట 18 36,30293 26,68,379 9,61,914

లక్ష్యం.. వంద శాతం

లక్ష్యం.. వంద శాతం
Comments
Please login to add a commentAdd a comment