
‘యూడీఐడీ’పై అవగాహన కల్పించాలి
వరంగల్: ఆన్‌లైన్‌లో యూడీఐడీ కార్డుల దరఖా స్తుపై దివ్యాంగులకు అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్యదేవ రాజన్ సూచించారు. యూడీఐడీ, సోలార్ విద్యుత్ ప్లాంట్ల డీపీఆర్‌పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, ప్రభుత్వ ప్రధా న ఆస్పత్రుల పర్యవేక్షకులు, సంక్షేమ శాఖ అధికా రులతో శనివారం ఆమె హైదరాబాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ యూడీఐడీ పోర్టల్, ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల్లో యూనిక్ డిజబిలిటీ ఐడీ(యూడీఐడీ) కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గతంలో జారీ చేసిన సదరం సర్టిపికెట్లకు యూడీఐడీ కార్డులు మంజూరు చేసినట్లు వివరించారు. దివ్యాంగులు కచ్చితమైన చిరునామాతో www. swaralambanacard.gov. inలో దరఖాస్తు చేసుకుంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ లాగిన్‌లోకి వెళ్తుందని తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులు ఇచ్చిన సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుందని వివరించారు. షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం దివ్యాంగులు మెడికల్ క్యాంపునకు హాజరైతే ప్రత్యేక వైద్యులు పరిశీలించి వైకల్య శాతాన్ని నిర్ణయిస్తారని తెలిపారు. అనంతరం సర్టిఫికెట్ మంజూరు చేస్తారని చెప్పారు. సర్టిఫికెట్ ఎలాంటి ట్యాంపరింగ్ జరగకుండా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి సంతకం చేసిన ధ్రువీకరణ ప్రతులను హాస్పిటల్, డీఆర్డీఓ కార్యాలయాల్లో భద్రపరచాల ని తెలిపారు. దరఖాస్తులో నింపిన చిరునామాకు యూడీఐడీ కార్డు స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపిస్తారని పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ను యూడీఐడీ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సర్టిఫికెట్ల జారీకి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్, అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో సెర్ప్
సీఈఓ దివ్యదేవ రాజన్
Comments
Please login to add a commentAdd a comment