
నమూనా ఇందిరమ్మ ఇంటి పనుల పరిశీలన
సంగెం: మండల కేంద్రంలోని చేపట్టిన నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను జిల్లా హౌసింగ్ పీడీ గణపతి, డీఈలు లాల్‌కిషన్, విష్ణువర్ధన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని పీడీ అధికారులను ఆదేశించారు.
చంద్రుగొండలో చోరీ
నెక్కొండ: మండలంలోని చంద్రుగొండలో చోరీ జరిగింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాంకాల రేణుక గత నెల 27న గొర్రెకుంటలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లింది. తిరిగి శనివారం ఉదయం ఇంటికి చేరుకోగా చోరీ జరిగిందని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్స్ నిపుణులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. బీరువాలోని సుమారు 7.5 గ్రాముల బంగారు, 12 తులాల వెండి నగలు, రూ.29 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నమూనా ఇందిరమ్మ ఇంటి పనుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment