
ఐకమత్యంగా ఉంటేనే ప్రయోజనం
వరంగల్ చౌరస్తా: పద్మశాలి కులస్తులంతా ఐకమత్యంగా ఉంటేనే కులానికి ప్రయోజనం చేకూరుతుందని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, నగర మేయర్ సుధారాణి అన్నారు. ఈనెల 9న హైదరాబాద్ నాంపల్లి జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించే 17వ అఖిల భారత పద్మశాలి సంఘం, 8వ తెలంగాణ ప్రాంతీయ మహా సభ నేపథ్యంలో శనివారం వరంగల్ చౌర్‌బౌళిలోని పద్మశాలి ఫంక్షన్ హాల్‌లో సంఘం వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు లయన్ ఆడెపు రవీందర్, బచ్చు ఆనంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహా సభ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుల బలం చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్‌రావు దంపతులను సత్కరించారు. సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రావు, నాయకులు వడ్నాల నరేందర్, గుండేటి నరేందర్, ఈగ వెంకటేశ్వర్లు, వైద్యం రాజగోపాల్, తవుటం రవీందర్, పోరండ్ల కష్ణ ప్రసాద్, కందికట్ల ప్రశాంత్, కేదాశి వెంకటేశ్వర్లు, గడ్డం భాస్కర్, డీఎస్.మూర్తి, కుసుమ సతీశ్, వంగ సూర్యనారాయణ, గడ్డం కేశవమూర్తి, పులికంటి రాజేందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత పద్మశాలి సంఘం
జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి
Comments
Please login to add a commentAdd a comment