
భూతగాదాల్లో తలదూర్చొద్దు..
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
వరంగల్ క్రైం: భూతగాదాల్లో తలదూర్చొదని పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్ ఝా పోలీసులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న చైన్ స్నాచింగ్ కేసులను త్వరగా పరిష్కరించి నేరస్తులను పట్టుకోవాలని చెప్పారు. బెయిల్‌పై బయటకు వచ్చి వాయిదాలకు రాని నేరస్తులను కనిపెట్టి వారిని కోర్టులో హాజరు పర్చాలన్నారు. నిందితుల అరెస్ట్‌లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. రాత్రి వేళ్లల్లో నిరంతరం పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులు సరైన సమయంలో సెంటర్లకు చేరేలా ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ల వారీగా సమీక్షించిన సీపీ.. ఆస్తి, ఫోక్సో, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాద కేసుల స్థితిగతులపై తెలుసుకున్నారు. డీసీపీ షేక్ సలీమా, రవీందర్, రాజమహేందర్‌నాయక్, ఏఎస్పీ చైతన్, మనన్‌భట్‌తో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment