వరంగల్ అర్బన్: ‘చెత్త రెడ్యూస్, రీ యూజ్, రీసైక్లింగ్(ఆర్‌ఆర్‌ఆర్) సిటీస్–2.0’పై రాజస్తాన్ రాజధాని పింక్ సిటీ జైపూర్‌లో ఈనెల 2 నుంచి 12వ రీజినల్ సదస్సు జరగనుంది. ఈ మేరకు వరంగల్ నగర మేయర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డికి ఆహ్వానం అందింది. జీడబ్ల్యూఎంసీ పరిధి 66 డివిజన్ల వ్యాప్తంగా అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, చెత్త శుద్ధీకరణ, స్వచ్ఛ వరంగల్ కార్యక్రమాలపై సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు.
రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్
జేడీగా సాంబశివరావు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివేకానంద రీసెర్చ్‌స్కాలర్స్ హాస్టల్ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ అంకశాల సాంబశివరావు నియమితులయ్యారు. ఈమేరకు శనివారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను సాంబశివరావు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment