
క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరం
వరంగల్ లీగల్: క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సూచించారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వరంగల్ సహకారంతో అవగాహన, వ్యాధి స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిర్మలా గీతాంబ హాజ రై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం వాకింగ్, మద్యపానం, పొగాకుకు దూరంగా ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చని సూచించారు. అనంతరం వైద్యులు న్యాయవాదులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్‌పాండే, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, ప్రతిమ హాస్పిటల్ డాక్టర్ సుమిత్ర తిప్పాని, చౌకత్, ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
మహిళా న్యాయమూర్తులకు క్రీడా పోటీలు
ఈనెల 8న జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో శనివారం మహిళా న్యాయమూర్తులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబతోపాటు న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, క్షమా దేశ్‌పాండే, శ్రావణ స్వాతి ఉల్లాసంగా పాల్గొని చెస్, షటిల్ ఆడారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలా గీతాంబ
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరం
Comments
Please login to add a commentAdd a comment