
ఉద్యోగుల సమస్యలకు త్వరలో పరిష్కారం
హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓస్ భవన్‌లో శనివారం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కేంద్ర సంఘం నేతలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. సీఎం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారని, సీఎంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఆకుల రాజేందర్ నాయకత్వంలో హనుమకొండ జిల్లా యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర సంఘం సహకారంతో జిల్లా స్థాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌లను ఘనంగా సన్మానించారు. జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి ఫనికెల రాజేశ్, గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్, రామునాయక్, రాజీవ్ ఇతర నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment