
ఎంజీఎంలో కార్మికుల ఆందోళన
ఎంజీఎం: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంజీఎంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో సెక్యురిటీ కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకున్న సంస్థకు బిల్లులు నాలుగు నెలలుగా రావడంలేదని.. ప్రస్తుతం ఆ సంస్థ తమకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని కార్మికులు వాపోయారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు వరంగల్ కలెక్టర్ సత్యశారదను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన ఆమె.. నాలుగు రోజుల్లో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించి విధుల్లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment