ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి
● నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్
జాతీయ చైర్మన్ శ్రీనివాసరావు
హన్మకొండ: ప్రభుత్వం వెంటనే మానవహక్కుల కమిషన్, లోకాయుక్త చైర్మన్లను నియమించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ అయిలినేని శ్రీనివాసరావు కోరారు. ఆదివారం హనుమకొండ నయీంనగర్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్(ఎన్జీఓ) రాష్ట్ర స్థాయి సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్, వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా తమ సంస్థ వెంటనే స్పందిస్తుందన్నారు. హక్కులకు భంగం కలిగించినా, సమాజానికి, పర్యావరణానికి, మానవ హక్కులకు ఎలాంటి నష్టం చేకూర్చినా అండగా నిలుస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పరకాల సమ్మయ్య గౌడ్, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ప్రశాంత్‌రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాటూరి రవీందర్‌గౌడ్, ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment