వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీఓస్) వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యులు ఆదివారం నిర్ణయించారు. రెండు జిల్లా ల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య అనుమతి తో ఈనెల 4, 5 తేదీల్లో వేడుకలు నిర్వహించనున్నారు. 4న వరంగల్ కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మెడికవర్ ఆస్ప త్రి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అదేరోజు మధాహ్నం 2 గంటలకు హనుమకొండ ఐడీఓసీ లోని టీజీఓ భవన్‌లో మహిళా గెజిటెడ్ అధికారుల కు క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. 5వ తేదీన హనుమకొండ సమీకృత కలెక్టరేట్‌లో అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment