పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్ : పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. నగర పరిధిలో కొనసాగుతున్న శానిటేషన్ నిర్వహణ పనులను ఆమె ఆదివారం ఉదయం 5 గంటలకు 3వ డివిజన్, హనుమకొండ అశోకా జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ ప్రధాన రహదారి ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త తరలించే ట్రాక్టర్ డ్రైవర్ లాగ్ బుక్, రహదారిని శుభ్రం చేసే స్వీపింగ్ మిషన్‌ల లాగ్ బుక్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment