గ్రీవెన్స్‌లో 873 వినతులు పెండింగ్
మొక్కల రక్షణ బాధ్యత అధికారులదే..
వరంగల్: కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్, అధికారులకు ప్రజలు వినతులు సమర్పిస్తున్నారు. వినతులను కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తారు. అధికారులు వినతులపై దృష్టిసారిస్తే క్షేత్రస్థాయిలోని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మండల కేంద్రాల్లో వినతులు సమర్పిస్తున్నారు. జిల్లాలో ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది.. మళ్లీ మావద్దకే వచ్చారంటూ మండలస్థాయి అధికారులు ఎగతాళి చేస్తున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. ప్రతివారం గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి, సాధ్యం కాని వాటిపై ఫిర్యాదుదారులకు వివరంగా చెబితే మరోసారి వచ్చే అవకాశాలు ఉండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 17 వరకు గ్రీవెన్స్‌లో 11,915 వినతులు సమర్పించారు. ఇందులో 11,042 వినతులను వివిధ శాఖల అధికారులు పరిష్కరించారు. వివిధ కారణాల వల్ల మరో 873 ఫిర్యాదులు అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్నాయి.
ఎందుకు పెండింగ్ ఉన్నాయో చెప్పరు?
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వినతులపై స్పందిస్తున్నా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), పోలీసుశాఖలు పెద్దగా స్పందించకపోవడం విశేషం. ‘కుడా’కు 105 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లోనే ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్‌జోన్ డీసీపీకి 96 వినతులు వచ్చాయి. 53 పరిష్కారం కాగా 43 పెండింగ్‌లో ఉన్నాయి. నర్సంపేట ఏసీపీ పరిధిలో వచ్చిన 50 ఫిర్యాదుల్లో 7 మాత్రమే పరిష్కారం కాగా మామునూరు ఏసీపీ పరిధిలో 34 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బాధితులు మళ్లీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులు, పరిష్కారమైనవి,
పెండింగ్‌లో ఉన్న అర్జీల వివరాలు..
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి
వరంగల్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావాలని కలెక్టర్ సూచించారు.
వచ్చిన అర్జీలు 11,915..
పరిష్కారమైనవి 11,042
‘కుడా’, పోలీస్ శాఖల నో రెస్పాన్స్
శాఖ వినతులు పరిష్కారం పెండింగ్
జీడబ్ల్యూఎంసీ 471 349 122
జెడ్పీ సీఈఓ 141 30 111
కుడా 105 00 105
డీసీపీ ఈస్ట్‌జోన్ 96 53 43
ఏసీపీ నర్సంపేట 50 7 43
ఏసీపీ మామునూరు 34 00 34
ఎంజీఎం 4,694 4,669 25
ఆర్‌సీఓ(బాలుర గురుకులం) 93 60 33
జిల్లా రిజిస్ట్రార్ 57 25 32
డీఆర్డీఓ 922 916 6
అంగన్‌వాడీ 357 353 4
ఆరోగ్యశ్రీ 7 4 3
డీపీఓ 463 460 3
Comments
Please login to add a commentAdd a comment