అర్ధ శతాబ్దపు జ్ఞాపకాలు
నల్లబెల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 1974–75 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన వారంతా ఒక్కచోట కలిశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మొత్తం 32 మంది విద్యార్థులకు 22 మంది విద్యార్థులు హాజరుకాగా నలుగురు అనారోగ్యంతో రాలేకపోయారు. మిగిలిన ఆరుగురు మరణించారు. సమావేశమైన విద్యార్థులు మొదట సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాలలో అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువు జమ్ములపుడి రంగారెడ్డికి విద్యార్థులు పాదపూజ చేసి సన్మానించారు. చిరునామాలు, ఫోన్ నంబర్లను తీసుకున్నారు. పూర్వ విద్యార్థిని మంతెన ప్రమీద స్నేహితులకు పుష్పగుచ్ఛాలు, బహుమతులు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
నల్లబెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సందడి చేసిన 1974–75 సంవత్సరం బ్యాచ్ ఏడో తరగతి విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment