6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు

Published Mon, Mar 3 2025 1:36 AM | Last Updated on Mon, Mar 3 2025 1:34 AM

6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు

6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు

కాళోజీ సెంటర్‌: జిల్లాలో ఈనెల 6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 287 పాఠశాలల నుంచి 4,803 మంది బాలురు, 4,434 మంది బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 గంటల వరకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 7న సెకండ్‌ లాంగ్వేజ్‌, 10న థర్డ్‌ లాంగ్వేజ్‌, 11న మ్యాథమెటిక్స్‌, 12న ఫిజికల్‌ సైన్స్‌, 13న బయాలాజికల్‌ సైన్స్‌, 15న సోషల్‌ స్టడీస్‌ పరీక్ష ఉంటుందని విద్యాశాఖాధికారులు తెలిపారు.

పబ్లిక్‌ పరీక్షలకు 49 కేంద్రాలు

టెన్త్‌ వార్షిక పరీక్షలు ఈనెల 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలోని 287 పాఠశాలల నుంచి 9,237 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షల కోసం 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 550 మంది ఇన్విజిలేటర్లు, 50 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 49 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించినట్లు అధికారులు తెలిపారు.

ప్రశాంత వాతావరణంలో

నిర్వహించాలి..

ఈనెల 21 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 6 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎంఈఓలు, పాఠశాలల హెచ్‌ఎంలకు గైడ్‌ చేశాం. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం.

– మామిడి జ్ఞానేశ్వర్‌, డీఈఓ

4న కలెక్టరేట్‌లో

మహిళా దినోత్సవం

వరంగల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని వరంగల్‌, హనుమకొండ జిల్లాల తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు నిర్ణయించారు. వేడుకల్లో రెండు జిల్లాల మహిళా గెజిటెడ్‌ అధికారులు పాల్గొంటారు. వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్‌ సత్యశారద, ప్రావీణ్య అనుమతితో ఈనెల 4, 5 తేదీల్లో వేడుకలు నిర్వహించనున్నారు. 4న వరంగల్‌ కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మెడికవర్‌ హాస్పిటల్స్‌ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అదేరోజు మధాహ్నం 2 గంటలకు హనుమకొండ ఐడీఓసీలోని టీజీఓ భవన్‌లో మహిళా గెజిటెడ్‌ అధికారులకు క్రీడాపోటీలు, 5న హనుమకొండ కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement