ప్రీ ఫైనల్ పరీక్షలు ఉదయం వేళల్లో నిర్వహించాలి
నర్సంపేట: టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలను ఉదయం వేళల్లోనే నిర్వహించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడారు. వేసవి నేపథ్యంలో మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 వరకు పరీక్ష సమయం నిర్ణయిస్తూ విద్యాశాఖ సర్క్యూలర్ విడుదల చేయడాన్ని ఖండించారు. రంజాన్ మాసానికి పరీక్షలతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తా రు.తక్షణమే పరీక్షల వేళలు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి రాకం రాకేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బో ల్ల అజయ్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment