ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
● హాజరు కానున్న
12,321 మంది విద్యార్థులు
● ప్రతీ కేంద్రంలో
సీసీ కెమెరాలు ఏర్పాటు
కాళోజీ సెంటర్: ఈనెల 5 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని, ఏమైన సందేశాల నివృత్తికి 9240205555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 12,321 మంది పరీక్షలకు హాజరుకానున్నారని, వీరికి 26 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,967 మంది, ఒకేషనల్ 848 మంది మొత్తం 5,815 విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,739 మంది, ఒకేషనల్ 767 మంది మొత్తం 6,506 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. వార్షిక పరీక్షల దృష్ట్యా ప్రతీ సెంటర్‌లో సీసీ కెమెరాలు అమర్చినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు 26 పరీక్ష కేంద్రాలకు 26 సీఎస్‌లు, 26 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్, 8 మంది అదనపు సూపరింటెండెంట్స్, 3 ఫ్లైయింగ్ స్వ్కాడ్, 4 సిట్టింగ్ స్వ్కాడ్, 260 మంది ఇన్విజిలేటర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్నిశాఖల అధికారులు సహకరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment