దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
వరంగల్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అ న్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరి ష్కరించాలని, పరిష్కరించలేని దరఖాస్తులను ఎందుకు పరిష్కరించలేదో దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. గ్రీవెన్స్‌లో భూ సంబంధిత సమస్యలు 23, కలెక్టరేట్ సూపరింటెండెంట్ 15, జిల్లా వ్యవసాయశాఖ 11,జీడబ్ల్యూఎం 2,డీసీఎస్‌ఓ 5 (మొత్తం 88) దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి,ఉమారాణి,డీ ఆ ర్‌డీఓ కౌసల్యదేవి,జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి,జిల్లా వ్య వసాయశాఖ అధికారి అనురాధ,డీసీఓ నీరజ, డీపీ ఓ కల్పన,డీఎంఓ సురేఖ,అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ప్రజావాణిలో 88 వినతులు
Comments
Please login to add a commentAdd a comment