ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా?
పర్వతగిరి: రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని రావూరు గ్రామంలో ఎండిన వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆకేరు వాగు చెక్‌డ్యాం ఎప్పటికీ నీటితో కళకళలాడుతుండేదన్నారు. ఈ చెక్‌డ్యాం మీద కొత్తపల్లి, ల్యాబర్తి, బంధనపల్లి, కొత్తూరు, రోళ్లకల్, రావూరు, పర్వతగిరి, కల్లెడ, అన్నారం, సోమారం, జామస్థాన్‌పురం, మడిపల్లి, గుర్తూరు గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయం చేస్తూ సుమారు వెయ్యి ఎకరాల పైచిలుకు పంట సాగు చేసుకునేవారన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ కమలాపంతులు, మాజీ సర్పంచ్‌లు బండి సంతోష్, ఆమడగాని రాజుయాదవ్, విజయ్, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, ఆమ్లానాయక్, నరేష్, లక్ష్మినారాయణ, గడ్డి యాకయ్య, చింతల శ్రీనివాస్, బూర శ్యామ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment