విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగొద్దు
వరంగల్: యాసంగి పంటల సంరక్షణకు రాబోయే 10రోజులు అప్రమత్తంగా ఉండి ఎత్తిపోతల పథకా లకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సో మవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో సీఎస్ వివిధ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, గురుకులాల్లో రెగ్యూలర్‌గా తనిఖీలు తదితర అంశాలపై మాట్లాడారు. యాసంగి పంటలకు రిజర్వాయర్ల నుంచి విడుదల చేసిన ప్రతీచుక్కను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గురుకులాల్లో తనిఖీ చేసి విద్యార్థులకు నా ణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే 10 రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరా పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, హార్టికల్చర్ అధికారి సంగీతలక్ష్మి, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment