పీఏసీఎస్‌లకు ప్రత్యేక అధికారులు
నర్సంపేట: జిల్లాలోని నర్సంపేట డివిజన్‌లోని పలు సొసైటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కోఆపరేటివ్ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నర్సంపేట డివిజన్‌లో 13 సొసైటీలు ఉండగా ఇందులో చెన్నారావుపేట సొసైటీకి ప్రత్యేక అధి కారిగా వెంకటేశ్వర్లు, నెక్కొండ పీఏసీఎస్‌కు కీర్యానాయక్, ఖానాపురం పీఏసీఎస్‌కు రవికిరణ్, దుగ్గొండి మండలం నాచినపల్లికి విజయ్‌భాస్కర్‌రెడ్డి, నల్లబెల్లి పీఏసీఎస్‌కు రాజును ప్రత్యేక అధికారులుగా నియమించారు. అయితే డివిజన్‌లో ఆరు మండలాల్లో 13 పీఏసీఎస్ సొసైటీలు ఉండగా కేవలం ఐదు సొసైటీలకు మాత్రమే ప్రత్యేక అధికారులను నియమించడంతో పలువురు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు, రైతుల పేరిట అక్రమ రుణాలు పొందారని ఆరోపణలు రావడంతోనే ప్రత్యేక అధికారులను నియమించారని పలువులు చర్చించుకుంటున్నారు. ఈ సొసైటీలకు ప్రత్యేక అధికారులను కేటాయిస్తే మిగతా ఎనిమిది సొసైటీల పరిస్థితి ఎలా ఉంటుందోనని అంటున్నారు. మరో ఆరు నెలలు పాలకవర్గాలు పాలించేనా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా? అని డివిజన్ రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment