‘నీట్’కు కేంద్రాలను గుర్తించాలి
వరంగల్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2025 నిర్వహణకు జిల్లాలో పరీక్ష కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మే 4న జరిగే నీట్‌కు, కేంద్రాల ఎంపిక, కనీస సౌకర్యాల కల్పనపై మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని సుమారు 6,300 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 20 గదుల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు/కళాశాలలను గుర్తించాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనువుగా ఉండే ఫర్నిచర్, వెంటిలేషన్, తాగునీరు, సీసీ టీవీల పర్యవేక్షణ, దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండే వాటిని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీ రవీందర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, పరీక్షల కోఆర్డినేటర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment