పోలీస్ జాగిలాల పాత్ర కీలకం: సీపీ
వరంగల్ క్రైం: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెలలో మొయినాబాద్‌లోని పోలీస్ జాగిలాల శిక్షణ కేంద్రంలో శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన ఐదు పోలీస్ జాగిలాలు వరంగల్ కమిషనరేట్ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో చేరి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాయి. పేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్ మాలినోస్, రెండు గోల్డెన్ రీట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలను సంబంధించిన పూర్తి వివరాలను సీపీకి హ్యాండ్లర్లు వివరించారు. జాగిలాలకు మెరుగైన వసతి కల్పించాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్, ఆర్‌ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జ్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, హ్యాండ్లర్లు రాజేశ్‌కుమార్, వెంకన్న, సురేశ్, దిలీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment