పైసలు రాలే!
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
దుగ్గొండి: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గత సంవత్సరం నవంబర్ 6 నుంచి జిల్లాలోని 315 గ్రామాలు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1.79 లక్షల కుటుంబాలను 1,200 మంది ఎన్యుమరేటర్లను, 119 మంది సూపర్‌వైజర్లు సర్వే చేశారు. ఒక్కో ఎన్యుమరేటర్ 150 ఇళ్లు సర్వే చేశారు. నవంబర్ 28 వరకు ఇంటింటి సర్వే పూర్తిచేసి డిసెంబర్ 10 వరకు 600 మంది ఆపరేటర్లు డేటా ఎంట్రీ పూర్తి చేశారు.
మూడు నెలలుగా ఎదురుచూపులు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా పనిచేసిన ఎన్యుమరేటర్లకు రూ.10 వేలు, సూపర్‌వైజర్లకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే చేసిన అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్లర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.30 చొప్పున చెల్లించాల్సి ఉంది.
సర్వే పూర్తి మూడు నెలలు దాటినా ఒక్కపైసా రాలేదని, తాము నిద్రాహారాలు మాని పనిచేశామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేసిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఆపరేటర్లకు మొత్తం రూ.1,79,98,000 చెల్లించాల్సి ఉంది. సర్వే కోసం రూ.168 కోట్లు విడుదల చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పి రెండు నెలలు దాటినా నేటికి అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సర్వే వేతనాలు విడుదల చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
ఈఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు జటబోయిన శివ. దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన ఇతడు సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా నియమితులయ్యాడు. దరఖాస్తుకు రూ.30 చొప్పున వస్తాయని 10 రోజులపాటు నిద్రాహారాలు లేకుండా పనిచేశాడు. 692 దరఖాస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశాడు. ఇందుకు రూ.20,760 రావాల్సి ఉంది. డబ్బుల కోసం పలుమార్లు మండల కేంద్రానికి వెళ్లి ఎంపీడీఓను కలిశాడు. డబ్బులు రాలేదు.. వచ్చాక ఇస్తాం అని చెప్పడంతో ఇక లాభం లేదని అడగడం మానేశాడు. ఇది ఒక్క శివ పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు.
ఇంకా అందని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే వేతనాలు
మూడు నెలలు గడిచినా
విడుదల కాని నిధులు
ఆందోళనలో ఎన్యుమరేటర్లు,
సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు..
కుటుంబాలు 1.79 లక్షలు
సర్వే చేసింది 1,200 మంది ఎన్యుమరేటర్లు,
119 మంది సూపర్‌వైజర్లు
డేటా ఎంట్రీ చేసింది 600 మంది ఆపరేటర్లు
రావాల్సిన వేతనాలు రూ.1,79,98,000
పైసలు రాలే!
పైసలు రాలే!
Comments
Please login to add a commentAdd a comment