ఇంటర్ పరీక్షలకు 26 కేంద్రాలు
కాళోజీ సెంటర్: జిల్లాలో బుధవారం నుంచి నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ప్రథమ సంవత్సరం పరీక్షకు 4,967 మంది జనరల్ విద్యార్థులు, 848 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 26 కేంద్రాలను ఏర్పాటు చేసి, 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 8 మంది అదనపు సూపరింటెండెంట్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్, 260 మంది ఇన్విజిలేటర్లు, 52 మంది ఏఎన్‌ఎంలు, పోలీస్ సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. సందేహాలు ఉంటే విద్యార్థులు 897708164 హెల్ప్ డెస్క్ నంబర్‌కు ఫోన్‌చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 చట్టం అమలు
వరంగల్ క్రైం: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల పరిఽధిలో 163 బీఎన్‌ఎస్ చట్టం అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండడం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు, ఊరేగింపులు చేయడం నిషేధమని పేర్కొన్నారు. పరీక్ష సమయాల్లో జిరా క్స్ సెంటర్లను మూసివేయాలని, ఎవరైనా ఉత్తర్వులు అత్రికమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా ఇంటర్ విద్యాశాఖ
అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్
Comments
Please login to add a commentAdd a comment