మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
వరంగల్: మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీఓ) అసోసియేషన్ బాధ్యులు మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం సెలవు ఉంటుందని.. కానీ, మహిళలకు సెలవు అనేది ఉండదన్నారు. కుటుంబ సభ్యుల క్షేమం, శాఖాపరమైన అభివృద్ధిలో భాగంగా మహిళ నిరంతరం శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఒత్తిడి అనేది మహిళలకే కాదు పురుషుల్లో కూడా ఉంటుందని, వారికి కూడా వైద్యశిబిరం అవసరమని గుర్తు చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని, మనకోసం మనం ఆలోచించినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. వాటిని అధిగమించాలంటే ప్రేరణ తరగతులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్ మోహ న్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, ఫణికుమార్, అనురాధ, నీరజ, డీఆర్‌ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీర్డీఓ కౌసల్య, డీపీఓ కల్పన, ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రాజేశ్‌కుమార్, రాజకుమార్, రామ్‌కిషన్, వేణుగోపాల్, డాక్టర్ మౌనికరాజ్, డాక్టర్ షఫీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కలెక్టరేట్‌లో వైద్య శిబిరం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment