● పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: ‘ఇది ప్రజా ప్రభుత్వం. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ కమిటీభ్యులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పథకం అమలులో లీడర్ అయినా.. కేడర్ అయినా పైసలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment