5
నిమిషాలు ఆలస్యమైనా
అనుమతి
విద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు నిర్ధేశించిన సమయం ఉదయం 9గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చినవారిని అనుమతించబోరు. ఈసారి పరీక్ష కేంద్రాన్ని గుర్తించేలా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. ఈ మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారంనుంచి ఇంటర్ ఫస్టియర్, 6వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. మంగళవారం అన్ని పరీక్ష కేంద్రాల్లో సీటింగ్ అరేంజ్‌మెంట్ చేశారు. హనుమకొండ జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తంగా 39,980మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికోసం 55 సెంటర్లు ఏర్పాటు చేశారు. 55 మంది చీఫ్‌సూపరింటెండెంట్లను, 55 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను 1050మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల కేంద్రాలకు 42మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరికి 26 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు.
అన్నిచోట్లా నిఘా
అన్ని సెంటర్లలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుచేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన ద్వారం వద్ద, ప్రిన్సిపాల్ గది, వరండా, ఒకవేళ పరీక్ష పూర్తయ్యాక వేరే గదిలోజవాబు పత్రాల ప్యాకింగ్ చేస్తే అక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని హై దరాబాద్‌లోని ఇంటర్‌బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. సంబంధిత ఉన్నతాధికారులు అక్కడి నుంచే ప్రతీ పరీక్ష కేంద్రంలోకి వచ్చి వెళ్లేవారు ఎవరనేది పరిశీలించే అవకాశం ఉంది. సెంటర్ సమీపంలో 144 సెక్షన్, జిరాక్స్ సెంటర్ల మూసివేత ఉంటుంది.
కేంద్రాల్లో వసతుల కల్పన
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారు. పరీక్షల సమయానికనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8–15 గంటలనుంచే లోనికి అనుమతిస్తారు. ఫోన్లు అనుమతించరు. ఫీజుల పేరుతో కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్ ఇవ్వకుంటే.. టీజీబీఐఈ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం క ల్పించారు. ఆ హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, అలా ఎవరైనా హాల్‌టికెట్‌తో వచ్చినా అనుమతించాలని ఇప్పటికే డీఐఈఓ సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు.
నేటినుంచి ఇంటర్ పరీక్షలు
కేంద్రాల్లో అన్ని వసతులు
పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 చట్టం అమలు
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల పరిఽధిలో 163 బీఎన్‌ఎస్ చట్టం అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండడం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు, ఊరేగింపులు చేయడం నిషేధమని పేర్కొన్నారు. పరీక్ష సమయాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, ఎవరైనా ఉత్తర్వులు అత్రికమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment