శ్రీరంగానికి ఉగాది పురస్కారం
పర్వతగిరి: మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గజవెల్లి శ్రీరంగం విశ్వశాంతి జాతీయస్థాయి ఉగాది పురస్కారం అందుకున్నారు. 30 సంవత్సరాలుగా జిల్లాలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదే రాష్ట్రాలతోపాటు రేడియో, టీవీ, రవీంద్రభారతిలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. అతడి ప్రతిభను గుర్తించిన శ్రీఆర్యాని సకల కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ దూడపాక శ్రీధర్ జాతీయస్థాయి ఉగాది పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఈనెల 5న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీరంగానికి అవార్డు అందజేసి సత్కరించారు.
ఇంటర్ సెకండియర్
పరీక్షలు ప్రారంభం
కాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా గురువారం 26 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయని ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మొదటి రోజు 4,838 మంది జనరల్ విద్యార్థులకు 4,718 మంది హాజరు కాగా.. 120 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 668 మంది ఒకేషనల్ విద్యార్థులకు 635 మంది హాజరుకాగా.. 33 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ లేకుండా ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభమయ్యాయని డీఐఈఓ వివరించారు.
శివలింగాన్ని
తాకిన సూర్య కిరణాలు
చెన్నారావుపేట : మండల కేంద్రంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలోని శివలింగాన్ని గురువా రం ఉదయం సూర్య కిరణాలు తాకా యి. ఈ సమయంలో అర్చకులు బీఎం శాస్త్రి, సాయిశాస్త్రి, గణేశ్‌శాస్త్రి మాట్లాడుతూ సూర్యకిరణాలు శివుడిని తాకడం శుభపరిణామమని, ప్రతి సంవత్సరం వసంత రుతువులో సూర్యకిరణాలు ఒకసారి తప్పనిసరిగా సిద్ధేశ్వరుడిని తాకుతాయని చెప్పారు. భక్తులు పాల్గొని పూజలు చేశారు.
ఆటో బోల్తా..
ఒకరి మృతి
నర్సంపేట రూరల్: ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడిన సంఘటన నర్సంపేట శివారులోని కమలాపురం క్రాస్‌రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట గ్రామానికి చెందిన పోశాల పూలమ్మ, కాకి స్వామి (55) ముత్తోజిపేట నుంచి ఆటోలో నర్సంపేట వైపు వెళ్తున్నారు. కమలాపురం క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా కారు రావడంతో ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కిందపడిపోయింది. ఆటోలో నలుగురు ఉండగా పోశాల పూలమ్మ, కాకి స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. కాకి స్వామి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య కోమల, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీరంగానికి ఉగాది పురస్కారం
శ్రీరంగానికి ఉగాది పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment