కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం
ఖిలా వరంగల్: హమాలీ కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అన్నారు. వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్డులో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వరంగల్ ఎన్‌ఎస్‌ఆర్, అపోలో, ఎలైట్ హాస్పిటల్స్, కాకతీయ నేత్ర వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైల్వే గూడ్స్‌షెడ్డులో ఎరువులను అన్‌లోడ్, లోడింగ్ చేసే హమాలీ కార్మికులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీరికి వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మండలాల వారీగా ఏర్పాటు చేయనున్న ఉచిత వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఏఓ సూచించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న హమాలీ కార్మికులకు ఆమె మందులు అందజేశారు. వైద్యులు, సిబ్బంది, కోరమండల్ డివిజనల్ హెచ్‌ఆర్ సుధాకర్, సీనియర్ మేనేజర్ సజన్‌కుమార్, ఆర్‌ఎల్‌ఎం శేషుకుమార్, గాయత్రి, సుమన్, శ్రీధర్, నరేశ్, కార్మిక నేత సారయ్య, అవంతి మేనేజర్ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ
అధికారి అనురాధ
Comments
Please login to add a commentAdd a comment