ఏజే మిల్లు కార్మిక భవన స్థలం సర్వే
వరంగల్: వరంగల్ లక్ష్మీపురంలో ఉన్న ఏజే మిల్లు కార్మిక భవనం మ్యూటేషన్, రిజిస్త్రేషన్‌తో పాటు నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని ఏజే మిల్లు భూముల పరిరక్షణ సమితి జేఏసీ, పలు సంఘాల నాయకులు ఆందోళనలు చేశారు. పలుమార్లు కలెక్టర్ సత్యశారద, కమిషనర్ వాకడేకు వినతిపత్రాలు సమర్పించి ల్యాండ్ సర్వే విభాగంతో సర్వే చేయించాలని కోరారు. ఈనేపథ్యంలో గురువారం ల్యాండ్ సర్వే శాఖ ఏడీ దేవరాజ్, డీఏ భుజంగరావు, సర్వేయర్ సందీప్ కార్మిక భవనం స్థలాన్ని రీ సర్వే చేశారు. జేఏసీ నాయకులు స్థలం వద్దకు వచ్చి ఏడీతో కాకుండా డీడీ నేతృత్వంలో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాలతోనే వచ్చామని అధికారులు తెలపడంతో నాయకులు సర్వేలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు గంగుల దయాకర్, ఆకెన వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల లక్ష్మణ్, డాక్టర్ కొనతం కృష్ణ, ఇనుముల శ్రీనివాస్, ఆరెళ్లి కష్ణ, జన్ను రమేశ్, కోమాకుల నాగరాజు, భాస్కర్, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment