కాజీపేట: దర్గాకాజీపేట శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో గురువారం సాయంత్రం ముగ్గురు యువకులు కూర్చుని సిగరేట్ పీల్చుతున్నారు. అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన రైల్వే పోలీసులు ఆ యువకులను గుర్తించి ఏం చేస్తున్నారంటూ మందలించారు. ఆ యువకులు తాగుతున్న సిగరేట్లను అక్కడే పడేసి పారిపోయారు. తీరా ఆ సిగరేట్లను పరిశీలించిన పోలీసులు ఆశ్యర్యపోయారు. గంజాయి సిగరేట్లు అని తెలుసుకుని అవాక్కయ్యారు. సిగరేట్ మాదిరే తయారు చేసుకుని పీల్చు తుండడం బట్టి చూస్తే నగరంలో ఈ గంజాయి పొడి లభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి ఘటనలు వరంగల్, మడికొండ, కాజీపేట శివారులోని బహిరంగ ప్రదేశాలు, కళాశాలల మైదానాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈగంజాయి సిగరే ట్లను అరికట్టకపోతే విద్యార్థులు, యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పోలీసులతో పాటు ఎకై ్సజ్ అధికారులు తీవ్రంగా పరిగణించి వరంగల్ నగర వ్యాప్తంగా తనిఖీలను చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment