ప్రజలకు పోలీసులు ఉన్నారనే ధైర్యం కలిగించాలి
సీపీ అంబర్ కిషోర్ ఝా
వరంగల్‌క్రైం : పోలీసులు ఉన్నారు.. మనకు సహాయం చేస్తారనే దైర్యాన్ని ప్రజలకు ఇవ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఇంటర్ సెప్టర్, పెట్రోకార్, హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో సీపీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదు వచ్చిన వెంటనే ఫిర్యాదుదారు వద్దకు చేరుకొని సమస్యను తెలుసుకొని, అక్కడే పరిష్కరించడం లేదా పోలీస్ స్టేషన్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. రాత్రి సమయంలో ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి ఎక్కువగా పెట్రోలింగ్ విధులు నిర్వహించాలని, ఏదైనా సమస్య వచ్చిన వెంటనే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ తెలంగాణ పోలీస్ కీర్తీ ప్రతిష్టలు పెంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, పోలీస్ కంట్రోల్ రూం ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్, ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment