శివాలయ పునఃనిర్మాణానికి రూ. 50 లక్షల విరాళం
శాయంపేట: మండలంలోని కొప్పుల గ్రామంలో పునఃనిర్మించనున్న శ్రీ సాంబశివ దేవాలయానికి రూ.50 లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త సామల పోతరాజు వెల్లడించారు. ఈసందర్భంగా పోతరాజు మాట్లాడుతూ.. తమ నానమ్మ, తాత, తల్లిదండ్రుల జ్ఙాపకార్థం గ్రామంలో నిర్మించే శివాలయానికి రూ. 50 లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. శివాలయానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన పోతరాజును క్లాస్‌మెట్స్ అభినందించారు. అనంతరం గ్రామంలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న అడిదెల రాజిరెడ్డి, దేవుపైడి, మునుకుంట్ల రమేశ్‌ను మాజీ కార్పొరేటర్ ఎలగం లీలావతి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వల్లాల వెంకటరమణ, ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, పోతుల వెంకటేశ్వర్లు, గోలి రఘోత్తంరెడ్డి, రాఘవ రెడ్డి, చిన్నాల సునిత, రమ, పద్మ, శ్రీహరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment