వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌

Published Sat, Mar 8 2025 1:20 AM | Last Updated on Sat, Mar 8 2025 1:20 AM

వరంగల

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్‌ పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

17 నెలలకే అంబర్‌ కిషోర్‌ ఝా బదిలీ

2023 అక్టోబర్‌ 13న అంబర్‌ కిషోర్‌ ఝా వరంగల్‌ సీపీగా నియమితులయ్యారు. 2009 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అంబర్‌ కిషోర్‌ ఝా ఇక్కడ 17నెలలు పనిచేశారు. 2023 అసెంబ్లీతోపాటు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. నగరంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 17 నెలల్లోనే ఆయనకు బదిలీ కాగా.. అంతే ప్రాధాన్యత గల మరో కమిషనరేట్‌ సీపీగా నియమితులయ్యారు.

ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా అంకిత్‌ కుమార్‌..

వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా ఉన్న రవీందర్‌ను సీఐడీకి బదిలీ చేసిన ప్రభుత్వం... ఆయన స్థానంలో డీసీపీగా అంకిత్‌ కుమార్‌ను నియమించింది. 2020 బ్యాచ్‌కు చెందిన అంకిత్‌ కుమార్‌ గతంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ లో ట్రైనీ ఐపీఎస్‌గా పనిచేశారు.

క్రైం డీసీపీగా జనార్దన్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ క్రైం డీసీపీగా బెదరకోట జనార్దన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం టీజీ ఎన్పీడీసీఎల్‌లో చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా ఉన్న ఆయన 1989 ఎస్‌ఐ బ్యాచ్‌కి చెందిన వారు. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో వివిధ పోస్టుల్లో పోలీసు అధికారిగా పనిచేశారు. సుమారు మూడేళ్లుగా ఎన్పీడీసీఎల్‌లో చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

రామగుండం సీపీగా

అంబర్‌ కిషోర్‌ ఝా బదిలీ

సూర్యాపేట ఎస్పీగా పనిచేస్తున్న సన్‌ప్రీత్‌

డీసీపీ రవీందర్‌ కూడా ట్రాన్స్‌ఫర్‌.. ఆయన స్థానంలో ఐపీఎస్‌ అంకిత్‌

క్రైం డీసీపీగా బెదరకోట జనార్దన్‌

సూర్యాపేట ఎస్పీ నుంచి

వరంగల్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌..

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్‌ ప్రస్తు తం సూర్యాపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన 2012లో ములుగు ఏఎస్పీగా, వరంగల్‌ రూరల్‌ ఓఎస్డీగా పనిచేశారు. అనంతరం ఎల్బీ నగర్‌ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా కూడా విధులు నిర్వర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌1
1/3

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌2
2/3

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌3
3/3

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement