
అన్ని రంగాల్లో మహిళలకు గుర్తింపు
● కలెక్టర్ సత్యశారద
వరంగల్: మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని కలెక్టర్ సత్యశారద అన్నారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో కలెక్టర్ మాట్లాడారు. గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రుల పెంపకంలో కుమార్తెలు సెన్సిటివ్‌గా మారుతున్నారని పేర్కొన్నారు. మహిళలు అనగానే సానుభూతి, త్యాగాలకు ప్రతీక ఒకప్పటి మాట అని, ప్రస్తుతం కొన్ని సమయాల్లో కఠినత్వాన్ని ప్రదర్శించక తప్పదని కలెక్టర్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.
జ్యూట్ ఉత్పత్తులపై అవగాహన అవసరం
జ్యూట్ ఉత్పత్తులపై అవగాహన అవసరమని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్‌లోని ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జనపనార ఉత్పత్తులు ప్రజ ల దినచర్యలో భాగం కావాలని పేర్కొన్నారు. జనపనార ఉత్పత్తులు, మార్కెటింగ్ తదితర అంశాలతో కూడిన జూట్ మార్క్ ఇండియా పథకంపై భారత ప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ, టెక్స్‌టైల్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ జె.నిశాంత్ మేత్రాస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ మహిళలకు వివరించారు. సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పొదుపు సంఘాల మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment