
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద అన్నారు. వెంకట్రావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శనివారం వారు భూమిపూజ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ సత్యశారదను ఎమ్మెల్యే నాగరాజు శాలువాతో ఘనంగా సన్మానించారు. అదనపు కలెక్టర్ సంద్యారాణి, తహసీల్దార్ విజయసాగర్, డిప్యూటీ తహసీల్దార్ వినయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment