మహిళా సాధికారతకు పెద్దపీట
సంగెం: మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో భూములు కోల్పోయిన రైతు కుటుంబాల మహిళలకు కుట్టు శిక్షణ శిబిరాన్ని మండల కేంద్రంలోని శాంతి మండల సమాఖ్యలో కలెక్టర్ సత్యశారదతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్‌చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. సంగెం, గీసుకొండ మండలాల పరిధిలోని భూ నిర్వాసిత మహిళలతోపాటు 18 నుంచి 35 ఏళ్ల మహిళలు కుట్టు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న యంగ్‌వన్ కంపెనీలో 23 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, అదనపు డీఆర్‌డీఓ రేణుకాదేవి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, డీపీఎం అనిత, మండల సమాఖ్య అధ్యక్షులు కల్యాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.
కొమ్మాల జాతరకు డీజేలను రానివ్వొద్దు..
గీసుకొండ: హోలీ నుంచి ప్రారంభమయ్యే కొమ్మా ల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కొమ్మాల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు డీజేలను రానివ్వొద్దని, ఒకవేళ వస్తే పోలీసుల వైఫల్యంగానే భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ చాడ కొమురారెడ్డి, గోదాసి చిన్న, నాగరాజు, గోపాల్ పాల్గొన్నారు. ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, అర్చకులు చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, రామాచారి, ఫణి, విష్ణు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment