నీటి సమస్య పరిష్కరించాలి
నర్సంపేట: పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీటి సమస్య ఉంటే త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. ఈ మేరకు నర్సంపేటలోని 24 వార్డుల్లో నీటి సరఫరా పనితీరు, ఫిల్టర్‌బెడ్, నర్సరీలను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని పైపులైన్, చేతిపంపు, మంచినీటి బావులను తనిఖీ చేసినట్లు తెలిపారు. నల్లాల ద్వారా రోజు వి డిచి రోజు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జోనా అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్స వం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. ఒక మహిళను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. అనంతరం మహిళా పారిశుధ్ధ్య కార్మికులు, మ హిళా ఉద్యోగులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ఆర్పీలను సన్మానించారు. డీఎంసీ రేణుక, ఏడీఎం వహీదా, ముఖ్య అధికారులు, వార్డు ఆఫీసర్లు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంధ్యారాణి
Comments
Please login to add a commentAdd a comment