మహిళ ఎదుగుదలతోనే దేశాభివృద్ధి
ఖిలా వరంగల్: ఇంటిని అందంగా తీర్చిదిద్దుతూ, పిల్లలను ప్రయోజకులను చేసే మాతృమూర్తి ఒక గొప్ప వాస్తుశిల్పి అని నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద అన్నారు. పురుషుడితో సమానంగా మహిళ అన్ని రంగాల్లో ఎదిగినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నా రు. వరంగల్ ఫోర్ట్‌రోడ్డులోని అన్నపూర్ణ కల్యాణ మండపంలో జిల్లా సంక్షేమ, వయోవృద్ధుల శాఖ ఆ ధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వా రు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మ హిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులతో సమానంగా ఎదగాలని సూచించారు. మహిళ ఎదగుదలలో విద్య ప్రధానమైందని, విద్య ఉన్నత ల క్ష్యానికి చేరుస్తుందని పేర్కొన్నారు. అనంతరం మ హిళా ఉద్యోగులు,క్రీడాకారులు,గాయకులను శాలు వాతో ఘనంగా సన్మానించారు. విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కా ర్పొరేటర్లు బి.ఉమ, దామోదర్, పల్లం పద్మ, ము స్కమల్ల పద్మ, గుండు చందన, పద్మ పాల్గొన్నారు.
మేయర్ గుండు సుధారాణి,
కలెక్టర్ సత్యశారద
Comments
Please login to add a commentAdd a comment