మెరుగైన వైద్యం అందించాలి
చెన్నారావుపేట: ట్రాలీ బోల్తాపడి తీవ్రగాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. జీడిగడ్డ తండా నుంచి మిర్చి ఏరడానికి వెళ్తున్న బొలెరో వాహనం ఇటీవల బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఆర్‌ఎంఓ అంబి శ్రీనివాస్, ప్రమోద్‌కుమార్, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, చెన్నారావుపేట వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పెట రమేశ్, జీడిగడ్డ తండా గ్రామ అధ్యక్షుడు బొంద్యాలు, సీనియర్ నాయకులు అందె వెంకటేశ్వర్లు, లచ్చిరామ్, శ్రీను తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment