మహిళలు సాధికారత సాధించాలి
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం వంగరలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్యులు రహమాన్, రుబీనా ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన సమావేశంలో డీఎమ్‌హెచ్‌ఓ అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు పౌష్టికాహరం తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించే దిశగా రాణించాలన్నారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ రాజశేఖర్, రవీందర్‌రెడ్డి, వాణి తదితరులు పాల్గొన్నారు. ముల్కనూరు స్వకృషి డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ రాష్ట్ర స్థాయిలో పాలు సరఫరా చేసిన మహిళా సభ్యులకు శాలువాతో ఘనంగా సన్మానించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డెయిరీ జీఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
వంగర పీహెచ్‌సీలో మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment